గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన పణిదెపు వెంకటకృష్ణ అనే ఉపాధ్యాయుడు రావి ఆకుపైన లక్ష్మీదేవి రూపాన్ని కత్తిరించి తన ప్రతిభను కనబరిచాడు. దీపావళి పర్వదినాన లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. కాబట్టే 'లక్ష్మీదేవి'ని చిత్రీకరించినట్లు తెలిపాడు. ఇకపై కరోనా మహమ్మారి అంతం అవ్వాలని కోరుకుంటూ వినూత్నంగా పండగ శుభాకాంక్షలు చెప్పారు.
ఆకుపై అద్భుతమైన కళ... వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు
కొందరు తమలోని ప్రతిభను కనబరచుకునేందుకు పలు రకాల ప్రయోగాలు చేస్తుంటారు. వినూత్న ఆలోచనలతో.. వారికున్న నైపుణ్యాలను విభిన్నంగా ప్రదర్శిస్తుంటారు. కళకు కాదేది అనర్హం అన్నట్లుగా రావి ఆకుపై దేవతా చిత్రాన్ని మలిచాడు ఓ ఉపాధ్యాయుడు.
రావి ఆకుపై లక్ష్మీదేవి రూపం