గుంటూరులో అంతర్ జిల్లా బాలబాలికల కుస్తీ పోటీలు - latest news on ap sports
గుంటూరులో 6వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల కుస్తీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపి రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల్లో 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
గుంటూరులో ప్రారంభమైన కుస్తి పోటీలు
ఆంధ్రప్రదేశ్ ఎమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ 6వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో అండర్ 20 జూనియర్ అండర్ 17 సబ్ జూనియర్ విభాగాల్లో క్రీడాకారులు తలపడనున్నారు. విజయం సాధించిన క్రీడాకారులు పాట్నా, హిమాచల్‌ప్రదేశ్‌లలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం తెలిపారు.