రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 31 వరకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలని... ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. కరోనా ప్రభావం ఉన్నందున వర్క్ ఫ్రం హోమ్ ప్రతిపాదనను పరిశీలించాలని విజ్ఙప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అంతా ఆన్లైన్లోనే జరుగుతోందని ఐకాస బాధ్యులు వివరించారు. కరోనా ప్రభావం ఎక్కువున్న హైదరాబాద్‌కు ఏపీలో కొందరు ఉద్యోగులు ఇప్పటికీ వారాంతాల్లో వెళ్లి వస్తుంటారని గుర్తుచేశారు. ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ అమలు సాధ్యం కాకుంటే మహిళా ఉద్యోగులకైనా సదుపాయం కల్పించాలని కోరారు.
'మాకూ వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించండి' - ఏపీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమకు ఇంటి నుంచే పనిచేసే(వర్క్ ఫ్రం హోమ్) అవకాశాన్ని కల్పించాలని రాష్ట్ర ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. అందరికీ ఇవ్వడం కుదరకపోతే కనీసం మహిళా ఉద్యోగులకైనా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రధాని మోదీ కూడా వీలున్నంత వరకు వర్క్ ఫ్రం హోమ్‌కు పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రకాశం, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నందున... వర్క్ ఫ్రం హోమ్ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఐకాస కోరింది. కరోనా ప్రభావంతో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సహా... ప్రభుత్వ పథకాల అమల్లో సమర్ధవంతంగా సేవలందిస్తామని ఉద్యోగులు చెప్పారు.
ఇదీ చదవండి:లండన్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు