పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అద్భుత పురోగతి సాధించింది. దేశంలో ఉద్యాన పంటలకు మారుపేరైన మహారాష్ట్రను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర రైతుల కంటే తక్కువ విస్తీర్ణంలో పండ్లతోటలు సాగు చేసినా.. మన రైతులు వారికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం విశేషం.
విభజన తర్వాత రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తి 29.77 లక్షల టన్నుల మేర పెరిగింది. 2014-15లో 91.21 లక్షల టన్నుల దిగుబడి రాగా... 2016-17 నాటికి అది 1.20కోట్ల టన్నులకు చేరింది. దేశంలో మరే రాష్ట్రమూ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్తో పోటీపడలేదు. రాష్ట్రంలో పండ్లతోటల సాగు విస్తీర్ణం 2014-15లో 5.45 లక్షల హెక్టార్లు కాగా... 2016-17 కి 6.04 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇది మహారాష్ట్ర కంటే లక్షన్నర హెక్టార్లు తక్కువైనా దిగుబడి దానికంటే 17లక్షల టన్నులమేర ఎక్కువ వచ్చింది.
పండ్ల దిగుబడిలో ఏపీ అగ్రస్థానం - production
పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అద్భుత పురోగతి సాధించింది. దేశంలో ఉద్యాన పంటలకు మారుపేరైన మహారాష్ట్రను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర రైతుల కంటే తక్కువ విస్తీర్ణంలో పండ్లతోటలు సాగు చేసినా.. మన రైతులు వారికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం విశేషం.
పండ్ల దిగుబడిలో ఆగ్రస్థానం