ఓట్లేసి గెలిపించిన నేతలు మోసం చేసినా.. న్యాయస్థానాలు తమను ఆదుకున్నాయని అమరావతి రైతులు అన్నారు. తమకు న్యాయస్థానాలే దేవాలయాలు.. న్యాయమూర్తులే దేవుళ్లు అని వారు అన్నారు. ఏకైక పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
రాజధాని ప్రాంతం తూళ్లురు, మందడం, వెలగపూడిలో 233వ రోజు మహాధర్నాలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. అయోధ్య రామాలయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. గతంలో అమరావతికి చేసిన శంకుస్థాపనను రైతులు, మహిళలు గుర్తు చేశారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. ప్రధాని మోదీ అమరావతి రైతులకు అండగా ఉండాలని కోరుతున్నారు.