కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. విమానాలు హైజాక్ చేస్తామన్న బెదిరింపులు, పుల్వామా ఘటనతో అప్రమత్తమైన నిఘావర్గాలు... అన్ని విమానాశ్రాయాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఆదేశాలతో పోలీస్, సీఆర్పీఎఫ్, ఆక్టోపస్ బలగాలు, బాంబు స్క్వాడ్ మోహరించి గన్నవరం విమానాశ్రయాన్ని జల్లెడపడుతున్నారు. అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లోపలికి వెళ్లే వాహనాలను తనిఖీ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా దిల్లీ నుంచి వచ్చి వెళ్లే ప్రయాణీకులపై బలగాలు దృష్టి సారించాయి.
'అణువణువు క్షుణ్ణంగా' - crpf
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. విమానాల హైజాక్, పుల్వామా ఘటనతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయాన్ని జల్లెడపడుతున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.