ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంత్యక్రియలయ్యాక వచ్చిన నివేదిక..కరోనా పాజిటివ్ నిర్ధరణ

అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే నివేదిక రాకముందే మృతదేహాన్ని బంధువులకు అప్పగించటంతో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఇప్పుడు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని అధికారులు క్వారంటైన్​కు తరలిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.

after completion of funreal process the dead body of a lady tested corona positive  in guntur dst sathenapalli
after completion of funreal process the dead body of a lady tested corona positive in guntur dst sathenapalli

By

Published : Jun 24, 2020, 4:29 PM IST

గుంటూరు జల్లా సత్తెనపల్లిలో ఇటీవల మరణించిన వృద్ధురాలికి కరోనా నిర్ధరణ అయింది. సత్తెనపల్లి బోయ కాలనీకి చెందిన వృద్ధురాలు అనారోగ్యానికి గురికాగా గుంటూరు జీజీహెచ్​కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. నివేదిక రాకముందే మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ రోజు వచ్చిన నివేదికలో వృద్ధురాలికి పాజిటివ్ వచ్చింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది.

మొత్తం 15 మందిని క్వారంటెన్​కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె నివాసం వద్ద ప్రాంతాన్ని మున్సిపల్ అధికారులు కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. సత్తెనపల్లి పరిధిలో గతంలో మృతదేహాల విషయంలో రెండుసార్లు పాజిటివ్​గా తేలింది. ఆ సందర్భాల్లో అంత్యక్రియలకు హాజరైన 10మంది వరకూ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఎంతమందికి వైరస్ వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details