A Wedding Stopped When Chicken Was Not Served: కట్నం చాలలేదనో ప్రేమ వ్యవహారాల కారణంగానో పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం.. కానీ, చిత్రంగా పెళ్లికొడుకు స్నేహితులకు చికెన్ వడ్డించలేదంటూ ఓ పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన తెలంగాణలోని హైదరాబాద్ షాపూర్‌నగర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన వరుడు, కుత్బుల్లాపూర్‌కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు.
చికెన్ వడ్డించలేదని ఆగిన పెళ్లి..
A Wedding Stopped When Chicken Was Not Served: ఇదేం విచిత్రం అండి.. బాబు. ఎక్కడైనా కట్నం చాలలేదనో, ప్రేమ వ్యవహారాల కారణంగానో పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం. కానీ ఇక్కడ చిత్రంగా వరుడు స్నేహితులకు చికెన్ వడ్డించలేదని పెళ్లి ఆగిపోయింది. ఇదేంటో చూసేద్ధాం..
షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఈ సందర్భంగా ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడపెళ్లివారు బిహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబికులు కావడంతో శాకాహార వంటలు చేశారు. విందు ముగింపు దశలో పెళ్లికుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదని గొడవపడి తినకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య గొడవ జరిగి వివాహం ఆగిపోయింది. వెంటనే పెళ్లికుమార్తె కుటుంబికులు జీడిమెట్ల సీఐ పవన్‌ను కలిసి, విషయం వివరించారు. ఆయన రెండు కుటుంబాలవారిని ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఈనెల 30న వివాహం చేయాలని వధూవరుల కుటుంబికులు నిర్ణయానికి వచ్చారు.
ఇవీ చదవండి: