ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడిపై హత్యాయత్నం..పరిస్థితి విషమం - యువకుడిపై హత్యాయత్నం..పరిస్థితి విషమం

పాత కక్షలతో ముగ్గురు వ్యక్తులు కలసి ఒక యువకుడి కళ్లల్లో కారం చల్లి, కత్తి పీటతో దారుణంగా నరికారు. ఆ ఘటన తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో చోటుచేసుకుంది.

Attack_with_knife_on_the_person
యువకుడిపై హత్యాయత్నం

By

Published : Aug 6, 2021, 9:11 AM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ముగ్గురు కలిసి ఒక యువకుడి కళ్లలో కారం చల్లి కత్తిపీటతో దారుణంగా నరికారు. తీవ్రగాయాలైన యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి పై గురువారం రాత్రి ముగ్గురు వ్యక్తులు కలిసి దాడి చేశారు. అతని కళ్లల్లో కారం చల్లి కత్తి పీటతో తలపై నరకడంతో తీవ్రగాయాలయ్యాయి. దాడి చేసిన ముగ్గురిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు బాధితుని బంధువులు తెలిపారు.

తీవ్రగాయాలైన నాగరాజును తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య సిబ్బంది నాగరాజును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details