తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 6 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని గుంటూరు గ్రామీణ పోలీసులు దాచేపల్లి వద్ద పట్టుకున్నారు. కృష్ణా నది నుంచి రహస్యంగా పడవపై నుంచి తెచ్చి కారులోకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న 1846 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిడుగురాళ్లకు చెందిన కారు డ్రైవర్, అతని సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత - liquor caught in guntur
తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని గుంటూరు గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. దాచేపల్లి వద్ద కారులో తరలిస్తున్న 6 లక్షల రూపాయల సరకును స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్, అతని సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు.

6 లక్షల రూపాయల అక్రమ మద్యం పట్టుకున్న గుంటూరు గ్రామీణ పోలీసులు
ఇదీ చదవండి :