రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ 40వ రోజు రైతులు, మహిళలు మహా ధర్నాలో పాల్గొన్నారు. తుళ్లూరు రైతులు బాలకోటయ్య సత్రం వద్ద గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తుళ్లూరుతో పాటు నెక్కల్లు, దొండపాడు, అనంతవరం, నేలపాడు, తాడికొండ, పెదపరిమి గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాకు హాజరయ్యారు. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించిన మండలి ఛైర్మన్ షరీఫ్‌కు.. రైతులు, మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య అని.. అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు సంఘీభావం తెలపాలని రైతులు, మహిళలు కోరారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
తుళ్లూరు రైతుల గణతంత్ర వేడుకలు.. నిరసనలు - తుళ్లూరు రైతుల 40వ రోజు నిరసనలు
రాజధాని గ్రామాల్లో 40వ రోజూ ఆందోళనలు కొనసాగాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తుళ్లూరు రైతులు జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం నిరసనలు యథావిధిగా కొనసాగించారు.
తుళ్లూరు రైతుల గణతంత్ర వేడుకలు.. నిరసనలు