ఏపీ భవన్లో 'ఐ లవ్ అమరావతి' బోర్డు తొలగింపు దిల్లీ ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ఐ లవ్ అమరావతి బోర్డును సిబ్బంది తొలగించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. గతేడాది సంక్రాంతి పండగ సందర్భంగా ఐ లవ్ అమరావతి, సంక్రాంతి సంబరాల సెల్ఫీ బోర్డును కొన్ని లక్షల రూపాయలతో అప్పటి రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఏర్పాటు చేయించారు. అనంతరం సంక్రాంతి సంబరాల సెల్ఫీ బోర్డు తీసేసి...ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు కొనసాగించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత..ఇవాళ అమరావతి బోర్డును తీసివేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఆదేశాలకు అనుగుణంగా బోర్డును తొలగించినట్లు సిబ్బంది వెల్లడించారు. ఏపీ భవన్లో భోజనానికి వచ్చే వారు నిత్యం ఈ బోర్డు వద్ద సెల్ఫీలు తీసుకునేవారు. ఇదీ చదవండి : సెలెక్ట్ కమిటీ.. సభ్యుల పేర్లు పంపాలని ఛైర్మన్ లేఖ