ఇవీ చదవండి
ఏఎన్‌యూలో ఉత్సాహంగా జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు - 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ న్యూస్
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండో రోజు మూడు మీట్ రికార్డులు నమోదయ్యాయి. 18 సంవత్సరాల మహిళల 5వేల మీటర్ల పరుగు పందెం విభాగంలో మధ్య ప్రదేశ్ క్రీడాకారిణి మునిత ప్రజాపతి 24నిమిషాల 32సెకన్లలో పూర్తి చేసి మీట్ రికార్డు నెలకొల్పారు. 20 సంవత్సరాల మహిళల పోల్ వాల్డ్ విభాగంలో కేరళ క్రీడాకారిణి నివ్య ఆంటోని 3.75మీటర్లు దూకి మీట్ రికార్డు నెలకొల్పారు. 20 సంవత్సరాల మహిళల లాంగ్ జంప్ విభాగంలో కేరళ క్రీడాకారిణి జిస్నా 1.77మీటర్లు దూకి మీట్ రికార్డు నెలకొల్పారు.
జూనియర్ ఛాంపియన్షిప్