గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో మరో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో మంగళగిరి 4, నవులూరు 4, తాడేపల్లి 3, బాపట్ల 2, నర్సరావుపేటలో ఒక కేసు నమోదైంది. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 631కు చేరుకుందని అధికారులు తెలిపారు.
కరోనా ఉగ్రరూపం...జిల్లాలో మరో 14 కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసుల వార్తలు
గుంటూరు జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. జిల్లాలో మరో 14 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా...మెుత్తం కేసుల సంఖ్య 631కి చేరిందని అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లాలో నమోదైన మరో 14 కరోనా కేసులు
మంగళగిరి, తాడేపల్లిల్లో కేసులు పెరుగుతుండటంపై ఆయా ప్రాంతాల ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల కాలంలో గుంటూరు, నర్సరావుపేటలో కరోనా కేసులు తగ్గి వేరే పట్టణాల్లో పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అంత్యక్రియల అనంతరం యువతికి కరోనా...ఆందోళనలో బంధువులు !