ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డేటా సెంటర్ ...కేరాఫ్ వైజాగ్

దేశంలో అన్ని డేటా సెంటర్లను అనుసంధానిస్తూ విశాఖలో డేటా పార్క్ ఏర్పాటుచేస్తోంది అదాని గ్రూపు.

By

Published : Feb 14, 2019, 6:27 AM IST

data center

విశాఖపట్నంలో నిర్మాణం జరుపుకుంటున్న డేటా పార్క్
విశాఖపట్నం...అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఓ వైపు సముద్రం, మరో వైపు ఆహ్లాద వాతావరణం...ఎన్నో అనుకూలతల కలయికతో నవ్యాంధ్రకు అన్ని రకాలుగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అదే కోవలో పర్యావరణ హిత ఇంధన వనరులతో దేశలంలోనే అతిపెద్ద డేటా పార్క్ వైజాగ్ కు వస్తోంది.
విశాఖ కాపులుప్పాడ ప్రాంతంలో ...ఎత్తైన కొండలపై సుమారు 500 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద డేటా పార్క్ అందుబాటులోకి రానుంది. 70వేల కోట్ల రూపాయలతో అదానీ గ్రూప్ దీనిని అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తిగా పర్యావరణ హిత ఇంధన వనరులతో దీని నిర్మాణం జరుగుతోంది.
రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే 175 ఎకరాల భూమిని కేటాయించింది. 30కోట్ల రూపాయల వ్యయంతో 6.6 కిలోమీటర్ల మేర విశాలమైన రహదారులు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోంది. జి.చోడవరం, నకప్పల్లిలో మరో 325 ఎకరాల విస్తీర్ణంలో డేటాపార్క్ పనులు చేపట్టనున్నారు. 10 సంవత్సరాల వ్యవధిలో దశల వారీగా నిర్మాణం చేపడతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ డేటా పార్క్ లో వివిధ డేటా సెంటర్లు ఏర్పాటు అవ్వనున్నాయి. అదాని గ్రూప్ డేటా సెంటర్లకు అనువైన ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాత క్లౌడ్ సెంటర్ల ఏర్పాటుకు విశాఖ కేంద్రంగా నిలవనుంది. ఈ పార్క్ లో 5 గిగా వాట్ సామర్థ్యం ఉండనుంది. తొలిదశ ప్రాజెక్టు 18నెలల్లో పూర్తి చేయడమే అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details