ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Married Woman Murder and Lover Suicide: వివాహిత హత్య.. ప్రియుడి ఆత్మహత్య.. ఆడవారిని నమ్మొద్దంటూ లేఖ - Murder Case

Married Woman Murder : ఏలూరు జిల్లాలో ఓ మహిళ హత్యకు గురికాగా, ఆమె ప్రియుడు రైల్వే ట్రాక్ పై విగత జీవిగా కనిపించాడు. ప్రియురాలిని హతమార్చి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు డీఎస్పీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Married_Woman_Murder
Married_Woman_Murder

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 8:55 PM IST

Married Woman Murder and Lover Suicide in Eluru District : వివాహేతర బంధం రెండు ప్రాణాలను బలిగొంది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. మరో వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తున్న మహిళ.. హత్యకు గురి కాగా, సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివాహితను కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉండగా.. మృతదేహం రక్తపు మడుగులో పోలీసులు గమనించారు. ఆమె ప్రియుడు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడగా.. మహిళ మృతదేహంపక్కన 'ఆడవారిని నమ్మవద్దు, ఈ అమ్మాయిని నేనే చంపేశాను' అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Woman Murder Case: భర్తే హంతకుడు.. పథకం ప్రకారం అంతమొందించాడు: ఎస్పీ

వివాహేతర సంబంధం (extramarital affair) కారణంగా ఓ వ్యక్తి మహిళను దారుణంగా హత్య చేసి ఆపై ఆ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఏలూరు శనివారపేట చెందిన ఉడత వసంత కుమార్ సుజాతకు వివాహమై పదేళ్లు అవుతోంది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వసంత కుమార్ లారీ డ్రైవర్(Lorry driver) గా పని చేస్తున్నాడు. కాగా, వసంత కుమార్​కి స్నేహితుడిగా ఉండే దిమ్మేటి సత్యనారాయణతో సుజాత వివాహేతర సంబంధం పెట్టుకుంది.

Twist in Woman Murder: వివాహిత హత్య కేసులో ట్విస్ట్.. హంతకుడు భర్తేనా..!

సత్యనారాయణ ఏలూరులోని దక్షిణ వీధిలో నివాసం ఉంటున్నాడు అతను పెయింటర్​గా పని చేస్తున్నాడు. ఈ తరుణంలో దక్షిణపు వీధిలో సత్యనారాయణ నివాసం ఉంటున్న ఇంట్లోసుజాత దారుణ హత్యకు గురైంది. మృతదేహం రక్తం మడుగులో పడి ఉంది. ఇదే క్రమంలో సత్యనారాయణ నూజివీడు సమీపంలో రైల్వే ట్రాక్​పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఉదయం రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఈ కేసు సంబంధించిన వివరాలను తెలుసుకుని సత్యనారాయణ ఇంటికి వచ్చి పరిశీలించగా.. ఇంట్లో సుజాత విగతజీవిగా కన్పించింది. మృతదేహం(dead body)పక్కనే హత్యకు ఉపయోగించిన చాకు లభ్యమయింది. కొంత కాలంగా సుజాత సత్యనారాయణ తో సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. సుజాత మృతదేహం పక్కనే లేఖ రాసి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో 'ఆడవారిని నమ్మవద్దు, ఈ అమ్మాయిని నేనే చంపేశాను' అంటూ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.. ఈ సంఘటనలపై ఏలూరు డీఎస్పీ శ్రీనివాసరావు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సుజాత అనే మహిళను హత్య చేశారని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నాం. మృతదేహాన్ని పరిశీలిస్తే గొంతు కోసి చంపేసినట్లుగా తెలిసింది. ఎవరు చంపారు...? కారణాలు ఏమిటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతాయి. సత్యనారాయణ అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం ఉంది. ఆయన ఆత్మహత్యకు, సుజాత హత్యకు సంబంధంపై దర్యాప్తు కొనసాగిస్తాం. ఇరువురి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. కేసును అన్ని కోణాల్లో పరిశీలించి ఆధారాలు సేకరిస్తాం. - శ్రీనివాసరావు, డీఎస్పీ, ఏలూరు

వివాహితపై గొడ్డలితో దాడి.. నిందితుడు అరెస్ట్, పీడీ యాక్ట్ నమోదు

ABOUT THE AUTHOR

...view details