పోలవరం ప్రాజెక్టులో ధ్వంసమైన డయాఫ్రం వాల్ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు వివిధ కమిటీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఈ వాల్‌ను నిర్మించిన విదేశీ కంపెనీ బావర్ మూడు ప్రతిపాదనలు చేయగా.. దిల్లీ ఐఐటీ విశ్రాంత డీన్ వి.ఆర్.రాజు నేతృత్వంలోని కమిటీ కూడా దీనిపై దృష్టి సారించింది. ఐఐటీ నిపుణులు ఇటీవల పోలవరంలో డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు. మరో వైపు కేంద్ర జలసంఘం నిపుణులు, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ నిపుణులు కూడా పోలవరం సమస్యలపై దృష్టి సారించారు. తాజాగా వి.ఆర్.రాజు కమిటీ డయాఫ్రం వాల్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ...ప్రస్తుతం బయటకు కనిపిస్తున్న ధ్వంసమైన వాల్ కాకుండా...ఇంకా నీటిలోనే ఉన్న డయాఫ్రం వాల్ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు నీటి లోపల వీడియోలు చిత్రీకరించాలని సిఫార్సు చేశారు. అయితే గతంలోనే గజ ఈతగాళ్లను దింపి వీడియోలు తీయించాలనే ఆలోచన చేసినా అది అప్పటి నీటి ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ఈతగాళ్లు అంత సాహసం చేయలేదని తెలిసింది. ప్రస్తుతం నీటిలో ఉన్న డయాఫ్రం వాల్‌ను వీడియోతీసి పరిశీలించే అంశంపై దృష్టి సారించారు. మరో వైపు ఎంత మేర డయాఫ్రం వాల్ దెబ్బతిందో ఆ మేరకు సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించే అంశమూ చర్చల్లో ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర జలసంఘం ముందు బావర్ కంపెనీ మూడు ప్రతిపాదనలు ఉంచింది. ఇందులో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించే విషయం కొలిక్కి వచ్చినా దానిపై లోతుగా పరిశీలన సాగుతోంది.
బావర్ మూడు ప్రతిపాదనలు ఇవి...
దిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో బావర్ కంపెనీ ప్రతినిధులు మూడు ప్రతిపాదనలను నిపుణుల ముందుంచారు.
1. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న మేర సమాంతర డయాఫ్రం వాల్ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఎగువన...దిగువన కూడా సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించి ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానిస్తారు. అంటే జాకెట్ రూపంలో నిర్మిస్తారు.
2. ప్రస్తుత డయాఫ్రం వాల్‌లో రెండు వైపులా ధ్వంసమైనంత మేర ఎగువనే ఒక స్థాయిలో డయాఫ్రం వాల్ నిర్మించి ప్రస్తుత డయాఫ్రంవాల్‌కు అనుసంధానించడం.