జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైకాపా కాపు సామాజికవర్గ ప్రజాప్రతినిధులు.. రాజమహేంద్రవరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాపులకు మరింత మేలు చేయడంపైనే చర్చించామని వైకాపా నేతలు చెప్తున్నా కేవలం పవన్‌ను రాజకీయంగా ఎదుర్కోవడమే అజెండాగా సాగినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన కలిసి పోటీచేస్తే.. ఎలాంటి ప్రభావం ఉంటుందనే కోణంలోనూ సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. కాపు యువత ఓట్లు చీలిపోకుండా, వైకాపావెన్నంటిఉండేలా చేపట్టాల్సిన చర్యలపై మంతనాలు సాగినట్లు సమాచారం. వైకాపాలో ఉన్న కాపు నేతలను తిట్టిపోస్తూ పవన్ కల్యాణ్ అవమానిస్తున్నారని.. సమావేశం అనంతరం మంత్రులు మండిపడ్డారు.
పవన్ కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు వైకాపా కాపు నేతల వ్యూహ రచన - వైకాపా మంత్రులు వర్సెస్ పవన్ కల్యాణ్
YSRCP vs Janasena: జనసేనపై వైకాపా మరింత గురిపెట్టింది. పవన్ కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు వైకాపా కాపు నేతలు... వ్యూహ రచన చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన మంత్రులు, నాయకులు వైకాపాతోనే కాపులకు గుర్తింపని స్పష్టం చేశారు. మరోవైపు వైకాపాలో కాపునేతలెవరైనా సీఎం కాగలరా అని జనసేన సవాల్ విసిరింది.
వైకాపా కాపు నేతలు వర్సెస్ జనసేన
వైకాపా కాపు నేతల సమాశాన్ని కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రగా జనసేన నేతలు విమర్శించారు. పవన్‌ను తిట్టడానికే,సమావేశం పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: