హిందూ దేవాలయాలపై అన్యమతస్తుల పెత్తనం సహించేది లేదని భాజపా నాయకురాలు యామినీ శర్మ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారిని యామినీ శర్మ దర్శించుకున్నారు. కాకినాడ ఎండోమెంట్ డిప్యూటీ కమీషనర్‌గా క్రైస్తవ మతస్తున్ని నియమించే ప్రయత్నం జరుగుతోందని యామినీ శర్మ అన్నారు. ఆ నిర్ణయం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
'హిందూ దేవాలయాల పరిరక్షణకు ఉద్యమం చేస్తాం'
హిందూ దేవాలయాల పరిరక్షణకు ఉద్యమం చేస్తామని భాజపా నాయకురాలు యామినీ శర్మ అన్నారు. రాష్ట్రంలో దాడులు జరిగిన అన్ని ఆలయాలకు సీబీఐ విచారణ జరపాలని కోరారు.
యామిని శర్మ
అన్యాక్రాంతమైన ఎమ్ఎస్ఎన్ ఛారిటీస్, పిఠాపురం సంస్థాన భూములు, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని యామినీ డిమాండ్ చేశారు. హిందూ దేవాలయ పరిరక్షణకు కలిసి వచ్చే అందరితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. సీబీఐ విచారణ అంతర్వేది ఒక్క ఆలయానికే పరిమితం కాకూడదని.. రాష్ట్రంలో దాడులు జరిగిన అన్ని ఆలయాలకు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తిరుమలలో 'ఆ' నిబంధనను ఇప్పుడే ఎందుకు మార్చారు.. ?: ఐవైఆర్