ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలకు నీరు విడుదల

By

Published : Aug 11, 2020, 11:43 AM IST

కోనసీమకు సంబంధించిన మూడు కాలువలకు 2వేల150 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఏఈ సత్యనారాయణ తెలిపారు. ముక్తేశ్వర, అమలపురం, పి.గన్నవరం కాలువలకు వరుసగా 970, 756, 424 క్యూసెక్కుల నీటిని వదిలారు.

సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలకు నీరు విడుదల
సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలకు నీరు విడుదల


తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు సంబంధించి సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. మూడు కాలువలకు సంబంధించి 2,150 క్యూసెక్కుల విడుదల చేసినట్లు జలవనరుల శాఖ ఏఈ సత్యనారాయణ అన్నారు. ఆత్రేయపురం మండలం లోల్ల లాకుల నుంచి ముక్తేశ్వరం కాలువకు 970 క్యూసెక్కు నీరు, అమలాపురం కాలువకు 756, పి గన్నవరం కాలువకు 424 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details