తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం నాగుల్లంకలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా దాతలు కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామంలోని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి... తన మిత్రబృందంతో కలిసి సుమారు 2 వేల కుటుంబాలకు కూరగాయలు సమకూర్చగా... ఎమ్మెల్యే వాటిని ప్రజలకు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు.
2 వేల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ - కూరగాయలు పంచిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వార్తలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కోరారు. నాగుల్లంకలో దాతలు ఇచ్చిన కూరగాయలను ప్రజలకు పంపిణీ చేశారు.
![2 వేల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ vegetables distributed in naagullanka east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6945544-741-6945544-1587884786804.jpg)
కూరగాయలు పంచుతున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు