ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ - తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. బియ్యం, కూరగాయలు, పండ్లు, నిత్యావసరాలు ఎవరికి తగ్గట్లు వారు పంపిణీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో తెదేపా ఆధ్వర్యంలో గ్రామస్థులకు కూరగాయలు పంపిణీ చేశారు.

vegetables distributed by tdp former mla at raamavaram east godavari
తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

By

Published : Apr 15, 2020, 6:19 PM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెదేపా గ్రామ శాఖ ఆధ్వర్యంలో.. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గ్రామస్థులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 3.5 కిలోల చొప్పున సుమారు 2000 కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. కొవిడ్-19 తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్​డౌన్ అమల్లో ఉన్న కారణంగా నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయపడాలన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పిలుపు మేరకు.. కూరగాయలు పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details