తూర్పుగోదావరి జిల్లా ఆర్మ్ రిజర్వు కార్యాలయంలో పాత ఆయుధాల వేలం వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. వేలంలో నిబంధనలు పాటించలేదని ఆడిట్ తనికీలలో అధికారులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఈ టెండర్ దక్కించుకోవడంతో గుత్తేదారు నుంచి 582 పాత ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. టెండర్ రద్దు చేశారు. వేలంలో నిబంధనల అతిక్రమణపై విచారణ జరుపుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పారు. వేలం ప్రక్రియ కలెక్టర్ అనుమతితోనే గత ఎస్పీ హయాంలో జరిగిందని.. వేలంలో స్వల్ప లోపాలు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.
Arms auction: పాత ఆయుధాల వేలంలో అక్రమాలు !
తూర్పుగోదావరి జిల్లా ఆర్మ్ రిజర్వు కార్యాలయంలో పాత ఆయుధాల వేలం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ టెండర్ దక్కించుకోవడంతో గుత్తేదారు నుంచి 582 పాత ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Arms auction
"జిల్లాలోని ఆర్మ్ రిజర్వ్ కార్యాలయంలో పాత ఆయుధాల వేలం కలెక్టర్ అనుమతితోనే జరిగింది. అయితే వేలంలో అతిక్రమణలు జరిగినట్లు ఓ పత్రికలో ఈరోజు(నవంబర్18)న వార్త వచ్చింది. వేలంలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పొరపాటు జరిగింది. దానిపై విచారణ జరుపుతున్నాం" -ఎస్పీ రవీంద్రనాథ్, తూర్పుగోదావరి జిల్లా
ఇదీ చదవండి:గంజాయి రవాణాపై కొనసాగుతున్న దాడులు.. 1500 కేజీల పట్టివేత