ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధిలో భాగంగా.. రహదారి తాత్కాలిక మూసివేత

అభివృద్ధిలో భాగంగా కోనసీమలో 4 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా ఏర్పాటు చేసేందుకు.. ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీకి ప్రతిపాదనలు పంపినట్లు అమలాపురం డివిజన్ రాష్ట్ర భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ జి. శ్రీనివాస్ నాయక్ తెలిపారు. అలాగే ఈతకోట రహదారిని నెల రోజులపాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర భవనాల శాఖ ఏఈ రాజేంద్ర వెల్లడించారు.

development roads
అభివృద్ధిలో రహదారులు

By

Published : Mar 19, 2021, 11:08 AM IST


తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో 4 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా ఏర్పాటు చేసేందుకు.. ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీకి ప్రతిపాదనలు పంపినట్లు అమలాపురం డివిజన్ రాష్ట్ర భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ జి. శ్రీనివాస్ నాయక్ తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సిఫార్సు మేరకు.. ఈతకోట నుంచి పొదలాడ వరకు 30 కిలోమీటర్ల మేర ఆర్​.పీ రోడ్డు, రావులపాలెం నుంచి అమలాపురం వరకు 32 కిలోమీటర్లు, అమలాపురం నుంచి బొబ్బర్లంక రోడ్డు, కొత్తపేట బ్రిడ్జి నుంచి ముక్తేశ్వరం.. అక్కడినుంచి ముమ్మిడివరం వరకు 25 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు.

అభివృద్ధిలో భాగంగా రహదారి మూసివేత..

పి.గన్నవరం మండలంలో అభివృద్ధి పనులు నిమిత్తం.. గన్నవరం నుంచి రావులపాలెం మండలం ఈతకోట రహదారిని నెల రోజులపాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర భవనాల శాఖ ఏఈ రాజేంద్ర తెలిపారు. నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఈతకోట నుంచి పి.గన్నవరం మండలం జి.పెదపూడి వరకు ఆర్.పి రోడ్డును నెల రోజుల క్రితం 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బేస్ పనులను మొదలు పెట్టామన్నారు. అందుకుగాను అంబాజీపేట, కొత్తపేట మీదుగా రావులపాలెం, పి గన్నవరం నుంచి పోతవరం, నరేంద్రపురం, పప్పులవారి పాలెం, అవిడి, కొత్తపేట మీదుగా రావులపాలెం వెళ్లే విధంగా ట్రాఫిక్​ను మళ్ళించున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి...

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details