ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎంఈవో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు' - అనపర్తిలో ఉపాధ్యాయుల ఆందోళన

ఎంఈవో నిరంకుశ ధోరణితో ఉపాధ్యాయులను వేధిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు నిరసనకు దిగారు. మెడికల్ సెలవులు అవసరమైన వారికి ఇవ్వకుండా.. తనకు కావాల్సిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు.

teachers protest in anaparthi
ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

By

Published : Mar 14, 2020, 1:10 PM IST

ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

ఎంఈవో నిరంకుశ ధోరణితో ఉపాధ్యాయులను వేధిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు నిరసనకు దిగారు. ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వెళ్లి.. మళ్లీ పాఠశాలల్లో విధులకు హాజరవ్వాలని ఎంఈవో ఆదేశాలు జారీ చేశారన్నారు. మెడికల్ సెలవులు అవసరమైన వారికి ఇవ్వకుండా తనకు కావాల్సిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఆమెతో మాట్లాడేందుకు ఎంఈవో కార్యాలయం వద్దకు వెళ్లామనీ.. అయినా తమ ఆవేదన వినలేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి ఎంఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అక్కడకు చేరుకుని ఉపాధ్యాయులకు నచ్చచెప్పటంతో వారు నిరసన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details