ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికే చంద్రబాబు పర్యటన: జవహర్‌ - జగన్ ప్రభుత్వ వైఫల్యాలు

TDP LEADERS VISIT CBN MEETING PLACE : టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులు పర్యటించినున్నారు. ఈ నేపథ్యంలో.. బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాలను ఆ పార్టీ నేతలు పరిశీలించారు.

TDP LEADERS VISIT CBN MEETING PLACE
TDP LEADERS VISIT CBN MEETING PLACE

By

Published : Feb 7, 2023, 2:08 PM IST

TDP LEADERS VISIT CBN MEETING PLACE : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన రూట్​ మ్యాప్​, బహిరంగ సభ స్థలాలను జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కే.ఎస్​. జవహర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు.

సీఎం జగన్ పరిపాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని జవహర్ అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు నిర్వీర్యం చేశారని.. ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారన్నారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వ నాశనం చేశారని పేర్కొన్నారు. ఈ నెల 15న జగ్గంపేట, 16న పెద్దాపురం, 17న అనపర్తిలో చంద్రబాబు రోడ్ షో ఉంటుందన్న ఆయన.. జగన్ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details