రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగాలని..తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలపై పోలీసులు చేసిన లాఠీఛార్జీలకు వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు. ర్యాలీని ప్రత్తిపాడు పోలీసులు అడ్డుకోవడం వల్ల కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం పోలీసులతో పాలన కొనసాగిస్తుందని తెదేపా నేతలు విమర్శించారు. రాజధానిగా అమరావతి కొనసాగేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రాజా ప్రకటించారు.
ప్రత్తిపాడులో నల్ల కండువాలతో తెదేపా నిరసన ర్యాలీ - ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు నల్ల కండువాలతో ర్యాలీ
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగించాలని నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ వరుపుల రాజా ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి ఆందోళన చేశారు.
![ప్రత్తిపాడులో నల్ల కండువాలతో తెదేపా నిరసన ర్యాలీ tdp leaders in rally at Prathipadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5803026-163-5803026-1579699505032.jpg)
ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు నల్ల కండువాలతో ర్యాలీ