ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 10, 2020, 4:43 PM IST

ETV Bharat / state

'నంద్యాల ఘటనపై న్యాయం జరగకపోతే ఉద్యమిస్తాం'

నంద్యాల ముస్లిం కుటుంబం ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కోరారు. నంద్యాల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకింగ్​లా చూస్తోందని విమర్శించారు.

vanamadi venkateswararao
vanamadi venkateswararao

నంద్యాల ముస్లిం కుటుంబం ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేనిపక్షంలో ఉద్యమం చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు న్యాయం జరిగే రోజులు పోయాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకింగ్​లానే చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

కుటుంబం ఆత్మహత్యలకు సంబంధించి కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పుడు అధికారులు స్పందించి ఉంటే ఆత్మహత్యలు జరిగేవి కాదన్నారు. ముస్లింలకు తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ విషయంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details