రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని, రూల్ ఆఫ్ లా అసలు ఉందా? అనేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉందని మాజీ మంత్రి చిన రాజప్ప విమర్శించారు. వైకాపా పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా పని చేస్తుందని విమర్శించారు.
తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడమే ధ్యేయంగా జగన్ పాలన ఉందని రాజప్ప అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలు, దళితుల పట్ల వైకాపా ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని రాజప్ప ఆరోపించారు. విజయవాడ దుర్గగుడిలో సింహాల ప్రతిమలు చోరీ ఘటనను కప్పిపుచ్చేందుకు ఈవో కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేసేందుకు కేసుల పేరుతో దుర్మార్గపు చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు.