.
కోనసీమను కప్పేసిన పొగమంచు..! - తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అందాలు
కోనసీమ అందాలను చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. తెల్లవారుజామున పచ్చటి పొలాలపై మంచుకమ్ముకుంటే... ఈ దృశ్యాలను తలుచుకోవటానికే మనసుకు హాయిగా అనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉదయాన్నే ఇలాంటి వాతవరణమే కనిపిస్తుంది. ఆ కొబ్బరిచెట్లను కప్పిన మంచు... రహదారి కనిపించకుండా పట్టెసిన దట్టమైన పొగ... పక్షుల కిలకిలరావాలు... వీటన్నింటిని 'ఈటీవీభారత్' తన కెమెరాలో బంధించింది. మీరు చూడండి..!
కోనసీమలో ఉదయాన్నే పట్టేసిన పొగమంచు