అరుణాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం.... తమిళనాడు రాష్ట్రంలోనే ఇప్పటివరకూ అరుణాచలం ఆలయాన్ని మనం చూశాం. అలాంటి ఆలయాన్ని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో నిర్మించారు. ఇది దేశంలో రెండోది. ఆంధ్రాలో మొదటిది.
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో 1998లో 5 కోట్ల అంచనా వ్యయంతో అరుణాచల ఆలయ నిర్మాణం చేపట్టారు. భక్తులు, దాతల విరాళాలతో ఈ ఆలయం అత్యంత సుందరంగా నిర్మించారు. ఇప్పుడు పూర్తి నిర్మాణం పూర్తి కావడం వల్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. రేపు నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై అరుణాచలం ఆలయ ప్రధానార్చకులు శ్రీశంకర్ త్యాగరాజన్, శ్రీకందన్ మహాస్వామి హాజరు కానున్నారు. ఆలయ నిర్మాణంలో భాగంగా శ్రీఅతీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర ఛండీశ్వరుని విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి కుడివైపున దక్షిణామూర్తి, ఈశాన్యాన కుమారస్వామి, ఆగ్నేయాన విజయగణపతి ఉపాలయాలను నిర్మించారు.