తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. చెరుకూరి కల్యాణ మండపంలో ఈరోజు ఆయనకు కొవిడ్ పరీక్ష చేశారు. పార్లమెంటు సమావేశాల తర్వాత తాను నేరుగా రాజమహేంద్రవరం వచ్చానని.., ఇప్పటివరకూ ప్రజా సేవలో ఉన్నానని తెలిపారు. రేపు తన జన్మదినం సందర్భంగా ఇంటికి వెళ్తున్నానని.., అందుకే వైరస్ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఆయన పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది.
కరోనా పరీక్ష చేయించుకున్న ఎంపీ భరత్ - కరోనా పరీక్ష చేయించుకున్న ఎంపీ మార్గాని భరత్ వార్తలు
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. రేపు తన ఇంటికి వెళ్తున్నానని, అందుకే కొవిడ్ పరీక్షలు చేయించుకున్నట్లు ఎంపీ వివరించారు.
కరోనా పరీక్ష చేయించుకున్న ఎంపీ మార్గాని భరత్