ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ కోసం వేకువజాము నుంచి పడిగాపులు - carona effect

లాక్​డౌన్ సమయంలో రేషన్​ కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా చౌక డిపోల వద్ద రేషన్ సరుకుల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు.

pudding-from-early-morning-for-ration
pudding-from-early-morning-for-ration

By

Published : Apr 1, 2020, 8:57 AM IST

Updated : Apr 1, 2020, 10:13 AM IST

ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ సరుకుల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచే పడిగాపులు పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో చౌక డిపోల వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బారులు తీరుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరుకులు పంపిణీ చేస్తారు. 2 రోజులుగా సర్వర్ పనిచేయకపోవటంతో పంపిణీ వేగంగా జరగడం లేదు. అందుకే ప్రజలు ఈ సరకుల కోసం తెల్లవారుజాము నుంచే చౌక డిపోలకు చేరుకుని సామాజిక దూరం పాటిస్తూ బారులు తీరుతున్నారు.

రేషన్ కోసం సామాజిక దూరం పాటిస్తూ బారులు తీరిన ప్రజలు
ఇదీ చూడండి ఈటీవీ భారత్ కథనానికి స్పందన... నిబంధనలు ఉల్లఘించిన మార్టుపై కేసు
Last Updated : Apr 1, 2020, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details