ప్రేమ అంటూ నమ్మించి.. తనతో సహజీవనం చేసి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లికి విముఖత చూపిస్తున్నాడని.. ఓ యువతి ప్రియుని ఇంటి ముందు ఆందోళన చేసింది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం ఎస్ఆర్ పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూకరాజు.. హైదరాబాద్లో ఉన్న సమయంలో యువతిని ప్రేమించాడు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లికి నిరాకరించడంపై... పెద్దలు నచ్చచెప్పారు. చివరకు నూకరాజు పెళ్లికి ఒప్పుకొన్నాడు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.
పెద్దల సమక్షంలో.. ప్రేమజంట వివాహం
తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం ఎస్ఆర్ పేటలో ఊరి పెద్దలు ఓ ప్రేమ జంటకు ఆలయంలో వివాహం చేశారు.
ప్రేమ వివాహం