ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గట్ల వద్ద గంజాయి దాస్తే.. పోలీసులు పట్టుకున్నారు...

ఓ ఇద్దరు గంజాయి తెచ్చి..గ్రామశివారులో గట్ల వద్ద దాచారు. అక్కడికి ఎవరూ రారు అనుకొని ఆ ఇద్దరు గంజాయిని .. చెరో సగం పంచుకుంటుండగా.. ఊహించని ఘటన ఎదురైంది. ఎందుకంటే.. ఆ సీన్​లోకి పోలీసులు ఎంటర్​ అయ్యారు. షాకే కదా మరి.. వారు పారిపోయే ప్రయత్నం చేయగా తరువాత పోలీసులు వారిని పట్టుకున్నారు.

police take over marijuana at anaparthi
అనపర్తిలో ఆరు కిలోల గంజాయి పట్టివేత

By

Published : Jul 7, 2021, 11:51 AM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గంజాయి పంచుకుంటుంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ భాస్కరరావు ఈ వివరాలు వెల్లడించారు.

అనపర్తి మండలానికి చెందిన మేడిశెట్టి సుభాష్(23), గొలుగురి మణికంఠ రెడ్డి(26)లు మద్యం, గంజాయికి బానిసలయ్యారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పదిరోజుల క్రితం ద్విచక్రవాహనంపై విశాఖ జిల్లా చింతపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద 6 కేజీల గంజాయిని సుమారు రూ.10వేలకు కొనుగోలు చేశారు. దానిని అనపర్తి శివారు ఒక పొలం గట్టువద్దనున్న చెట్ల వద్ద దాచారు.

మంగళవారం ఆ ఇద్దరు గంజాయిని పంచుకుంటుండగా... పోలీసులు తమకు వచ్చిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు కిలోల గంజాయి, రెండు సెల్​పోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ భాస్కరరావు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని అన్నారు. అనపర్తిలో ఎక్కువమంది యువకులు గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలయ్యారని.. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి:తెలంగాణ: గాంధీభవన్​లో వేడుకగా రేవంత్​ రెడ్డి ప్రమాణస్వీకారం..

ABOUT THE AUTHOR

...view details