తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నాటుసారా విక్రయించేందుకు సిద్ధమైన పలు ప్రాంతాలకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన వీధి కోటేశ్వరరావు, రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన గంగుమల్ల లక్ష్మణుడు, కొత్తపేట మండలం పూజారివారిపాలేనికి చెందిన చిత్రదుర్గ రావులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 70 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై హరికోట శాస్త్రి అన్నారు.
రావులపాలెంలో సారా విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సారా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.
రావులపాలెంలో నాటుసారా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు