ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పావురాన్ని.. 'పట్టీ'చ్చింది - dove band identify owner in east godavari

దారితప్పిన ఓ పెంపుడు పావురం ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వచ్చినా... తను ఎక్కడుందో...యజమానికి సమాచారం అందించింది. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే..!

person attached a band to his dove to identify
పావురాన్ని.. 'పట్టీ'చ్చింది

By

Published : Jan 8, 2020, 7:12 AM IST

పావురాన్ని.. 'పట్టీ'చ్చింది
విశాఖతీరం నుంచి ఎగిరి వచ్చిన ఓ పావురం తూర్పుగోదావరి జిల్లా చినశంకర్లపూడి వచ్చి వాలింది. పంజరం దాటుకొని బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా వచ్చేసింది. అలా వచ్చిన ఆ కపోతం గ్రామంలోని చెనుబోయిన సత్తిబాబు ఇంటి వాకిలిలో వాలింది. పావురాన్ని పట్టుకున్న సత్తిబాబు... కపోతం కాళ్లకు పట్టీలు గమనించారు. పట్టీలపై ఉన్న చరవాణి నంబరుతో దాని నివాసం విశాఖ అని తెలిసింది. నంబరు ఆధారంగా యజమానికి ఫోన్‌చేసి పావురం సమాచారం చేరవేశారు. జాగ్రత్తగా చూడండి తాను స్వయంగా వచ్చి పావురాన్ని తీసుకెళ్తానని యజమాని తెలిపారు. ప్రస్తుతం ఆ పావురం చిరశంకర్లపూడిలో బస చేసింది. ఈ సమాచారం గ్రామంలో ఆసక్తికరం కలిగిస్తుంది. 26 మైళ్ల దూరంలో ఉన్నవాటినీ గుర్తించగలిగే బుద్ధికుశలత ఉన్న ఈ కంఠీరవం లోగడ యుద్ధంలో శత్రువుల ఉనికిని తెలుసుకొనేందుకు వినియోగించేవారని చెబుతుంటారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details