పుదుచ్చేరికి చెందిన పాఠశాల విద్యార్థులు సృజనాత్మకతతో పనికిరాని ఈత ఆకులు, తాటి డొప్పలు, గుమ్మడి, ఆనపకాయలను కళాకృతులుగా తీర్చిదిద్దారు. వీరు రూపొందించని కళా ఖండాలు యానాంలో మూడు రోజుల పాటు జరిగే ఫల, ఫుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాలలో క్రాఫ్ట్ టీచర్ ఇచ్చిన శిక్షణతో వీటిని తయారు చేశామని విద్యార్థులు తెలిపారు. పాఠశాల విరామ సమయంలోనూ, సెలవు దినాల్లోనూ వీటి తయారీ నేర్చుకోవడం విశేషం. వీటి విలువ 200 నుంచి 2000 రూపాయల వరకు ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు.
ఇవీ చూడండి..