తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోనకు ఈనెల 27 నుంచి రోజుకు లక్ష రూపాయల పైబడి నష్టం వచ్చిందని డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ తెలిపారు. ఈ డిపోలో 132 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కోనసీమకు రోడ్డు రవాణా మార్గం తప్ప రైలు మార్గం లేదు. దీంతో అమలాపురం ఆర్టీసీ డిపోనకు మామూలు రోజుల్లో ప్రయాణికుల పరంగా మంచి డిమాండ్ ఉంటుంది. కరోనా కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నెల 21 నుంచి ప్రజా రవాణాకు అనుమతి ఇవ్వడంతో అమలాపురం డిపో నుంచి 132 బస్సుల్లో కేవలం 30 నుంచి 40 బస్సులు మాత్రమే తిప్పుతున్నారు. వాటికి కూడా ప్రయాణికులు అంతంతమాత్రంగా ఉండటంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అమలాపురం బస్టాండ్ అతి తక్కువ మంది ప్రయాణికులతో వెలవెలబోతోంది. ఇక్కడ నుంచి తిరుపతికి 2 విజయవాడ 7 విశాఖపట్నం 8 కాకినాడ 3 రాజమండ్రి 6 ప్రధాన సర్వీసులతో పాటు పల్లెవెలుగు బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. మొత్తం బస్సులు తిరిగి ప్రయాణికుల సంఖ్య పెరిగితే గాని కష్టాలు తప్పవని డిపో మేనేజర్ సుధాకర్ అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీ బస్సులకు స్పందన కరువు...
లాక్ డౌన్ సడలింపులతో రోడ్ల పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులకు ఆశించిన స్పందన రావటంలేదు. అమలాపురం ఆర్టీసీ డిపోనకు ఈనెల 27 నుంచి రోజుకు లక్ష రూపాయల పైబడి నష్టం వచ్చిందని డిపో మేనేజర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సులు తిప్పుతున్న ప్రయాణికులు నామమాత్రం