తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి తలంబ్రాలకు వరి పంట కోత ప్రారంభించారు. శ్రీరామ నవమికి భద్రాచలం, ఒంటిమిట్ట రాముల వారికి కోటి తలంబ్రాలు పంపిచండం ఇక్కడి ఆనవాయితీ. వానర సేన, శ్రీ రాముడి వేష ధారణలో భక్తి శ్రద్ధలతో గోకవరం మండలం... అచ్యుతాపురంలో పంట కోత ప్రారంభమైంది.
శ్రీరాముడు, ఆంజనేయ, అంగద, సుగ్రీవ, జాంబవంతుడి వేషధారణతో పాటలు పాడుతూ.... ఈ కార్యక్రమం నిర్వహించారు. 800 కేజీల ధాన్యాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 60 గ్రామాల్లో గోటితో వలిపిస్తారు. సీతా రాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయనున్నారు.