తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం సత్యగిరిపై హరిహర సదన్ వసతి సముదాయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వలస కార్మికులను తరలించారు. వీరితో పాటు కాశీ నుంచి తిరిగి వచ్చిన మరో 39 మందిని అక్కడే ఉంచారు. సుమారు 200 మందిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అన్నవరం క్వారంటైన్ కేంద్రానికి 200 మంది తరలింపు - అన్నవరంలో కరోనా కేసులు
అన్నవరం దేవస్థానం హరిహరసదన్ క్వారంటైన్ కేంద్రానికి 200 మందిని తరలించామని అధికారులు తెలిపారు. వీరిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వలస కూలీలు, కాశీ నుంచి తిరిగివచ్చిన వారు ఉన్నారని చెప్పారు.
అన్నవరం క్వారంటైన్ కేంద్రానికి 200 మంది తరలింపు