ముమ్మిడివరంలో శ్రీరాముని కల్యాణం.. కమనీయం - శ్రీరామ నవమి
జగదభి రాముని కల్యాణోత్సవాలు కన్నుల పండవగా జరుగుతున్నాయి. ముమ్మిడి నియోజకవర్గ వ్యాప్తంగా సీతారాముని కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా నిర్వహిస్తున్నారు.
ముమ్మిడి నియోజకవర్గంలో జగదభి రాముని కల్యాణోత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జగదభి రాముని కల్యాణ మహోత్సవాన్ని వాడవాడలా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో రామాలయాల వద్ద సందడి నెలకొంది. సీతారాముల వారిని ప్రత్యేక వేదికపై అలంకరించి కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన చేస్తున్నారు.