అమ్మతనం... మనుషుల్లో అయితే ఏంటీ.? జంతువుల్లో అయితే ఏంటీ.? ఒకటే. ఇంకా చెప్పుకోవాలంటే.. మనుషుల కంటే కాస్త ఎక్కువేనేమో. తల్లిని చంపిన బిడ్డ, బిడ్డను చంపిన తల్లి.. ఇది మనుషులకు సంబంధించి వింటున్న వార్తలు. తోటి ఏనుగు జాడకోసం బీభత్సం సృష్టించిన గజరాజులు..! ఇవీ జంతువుల గురించి చదువుతున్న వార్తలు. ఓ శునకం చేసిన పని... జంతువుల్లో 'మానవత్వం' బతికుందేమోనని అనిపిస్తుంది. అసలు ఆ శునకం కడుపు కోత కథలోకి వెళ్తే..
ఎంత వింత: మనుషులకే లేని బాధ్యత... ఈ శునకానిది..! - mother dog Burial another dog in east godavari news
రోడ్డు మీద.. తెలిసినవారు చనిపోతేనే మెల్లిగా జారుకుంటాం. దగ్గరి బంధువు చనిపోతే కొన్నిసార్లు వెళ్లం... ఎందుకులే చావు దగ్గరకు అని. 'మానవత్వం' మనుషుల మనసులో నుంచి వెళ్లిపోయిన పదం. జంతువులు మాత్రం.. ఆ పదానికి నిర్వచనం చెబుతున్నాయి. వాటి ప్రేమకు కొత్తగా పేరు పెట్టాలేమో. మనిషి చనిపోయాక కొంతమంది చేయలేని కార్యక్రమాన్ని.. తన బిడ్డ చనిపోతే.. ఓ శునకం చేసింది.
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో మధ్యాహ్న సమయం. ఓ తల్లి శునకం. తన బిడ్డతో కలిసి ఆహారం కోసం రోడ్డుపై వెళ్తోంది. అలా రోడ్డు దాటుతుండగా ఓ ఆటో కుక్కపిల్ల పైనుంచి వెళ్లింది. పాపం అది అక్కడికక్కడే చనిపోయింది. తల్లి శునకం బాధ అంతా...ఇంతా కాదు. చుట్టూ.. చూసినా ఏ గుంపు అక్కడ కనిపించలేదు. చేసేదేమీ లేక తన బిడ్డను పక్కకు ఈడ్చుకుంటూ వచ్చింది. ఓ వైపు కంట కన్నీరు.. ఏం చేయాలో అర్థం కాక చివరిసారిగా తన బిడ్డను కళ్లారా చూసుకుంది. అనంతరం కుక్కపిల్లను పూడ్చిపెట్టింది.
ఇదీ చదవండి: అసలేంటా 'బోస్టన్' కన్సల్టింగ్ గ్రూప్..?