'రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి భాజపా కృషి' - development
ఐదేళ్లలో దేశ ప్రగతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే పని చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో భాజపా ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.
ప్రజల కోరిక మేరకు ఆదాయపన్ను పరిమితి 5 లక్షలకు పెంచామని మోదీ గుర్తు చేశారు.ఐదేళ్లలో కొత్త పన్నులు పెంచకపోగా.. రాను రానుతగ్గిస్తూ వచ్చామన్నారు. పన్నులు వసూలు కాకున్నా అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు.మత్స్యకారుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామని... ప్రత్యేక మంత్రిత్వశాఖనూఏర్పాటు చేశామని తెలిపారు. కిసాన్ కార్డుల తరహాలో మత్స్యకారులకూ క్రెడిట్ కార్డులు ఇస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించామని అన్నారు.