ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికులకు వాహనం ఏర్పాటు

లాక్​డౌన్ ప్రభావం​ వలస కూలీలపై తీవ్రంగా పడింది. పొట్ట కూటి కోసం కూలీనాలీ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వచ్చిన వారంతా.... పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ​తూర్పు గోదావరి జిల్లా దిండి వద్ద రైల్వే వంతెన పనులు చేసేందుకు వచ్చిన కార్మికులు కాలినడకన సొంత ఊళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు. మార్గ మధ్యలో వారిని చూసిన ఎమ్మెల్యే చిట్టిబాబు అమలాపురం ఆర్టీవో బీహెచ్​ భవాని శంకర్​తో మాట్లాడి వారిని స్వగ్రామాలకు వాహనంలో పంపించారు.

వలస కార్మికులకు వాహనం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే
వలస కార్మికులకు వాహనం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

By

Published : Apr 14, 2020, 12:53 PM IST

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి వద్ద రైల్వే వంతెన నిర్మాణ పనులు చేసేందుకు జిల్లాలోని చింతూరుకు చెందిన 12 మంది వలస కార్మికులు వచ్చారు. కొన్ని నెలలుగా వారంతా రైల్వే వంతెన పనులు చేస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా పనులు నిలుపుదల చేయగా.. స్వగ్రామానికి కాలినడకన వెళ్లేందుకు కార్మికులు పయనమయ్యారు. పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పెద్ద కందాలపాలెం వద్ద కార్మికులను చూసిన ఎమ్మెల్యే చిట్టిబాబు వారితో మాట్లాడారు.

ప్రజా రవాణా నిలిపివేసినందున కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం అమలాపురం ఆర్టీవో బీహెచ్​ భవాని శంకర్​తో మాట్లాడారు. కార్మికులను స్వగ్రామాలకు వాహనంలో పంపించారు. ఇందుకు సహకరించిన అధికారులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details