రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని.. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
వైఎస్ఆర్ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి మంత్రి కన్నబాబు శంకుస్థాపన - eastgodavari latest news
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వైఎస్ఆర్ వ్యవసాయ సమగ్ర పరిశోధన కేంద్రానికి మంత్రి కురసాల కన్నబాబు శంకుస్థాపన చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించనున్న వైఎస్ఆర్ వ్యవసాయ సమగ్ర పరిశోధన కేంద్రానికి మంత్రి కన్నబాబు శంకుస్థాపన చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలకు ఎరువులను తీసుకువెళ్లే రైతు భరోసా రథాలను ఆయన ప్రారంభించారు. పొడగట్లపల్లి గ్రామానికి చెందిన పలువురు వైకాపా పార్టీలో చేరడంతో వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవీ చదవండి:'వైకాపా అవినీతిని ప్రశ్నించినందుకే కొల్లు రవీంద్రను కేసులో ఇరికించారు'