ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు బజార్ కోసం స్థల పరిశీలన చేసిన మంత్రి కన్నబాబు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రైతు బజార్ కోసం.. మంత్రి కురసాల కన్నబాబు స్థల పరిశీలన చేశారు. పశువుల సంత ఉండే స్థలంలో.. రైతు బజార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

Minister Kannababu inspected the site for the rythu bazar at jaggampeta in east godavari
రైతు బజార్ కోసం స్థల పరిశీలన చేసిన మంత్రి కన్నబాబు

By

Published : Jul 3, 2021, 10:19 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రైతు బజార్ కోసం.. మంత్రి కురసాల కన్నబాబు స్థల పరిశీలన చేశారు. పశువుల సంత ఉండే స్థలంలో.. రైతు బజార్ కోసం స్థలాన్ని పరిశీలించి.. వెంటనే ఆమోదం తెలిపారు. జనావాసాల మధ్య పశువుల సంత ఉండటంతో.. స్థానికులంతా ఇబ్బంది పడుతున్నారని.. అందుకే వేరే చోటకి మార్చామని తెలిపారు. పశువుల సంత ఉన్న స్థలంలో.. సచివాలయం-1 నిర్మించి, రైతులకు మేలు చేసేలా రైతు బజారు ఏర్పాటు చేశామని చెప్పారు.

రాజపూడిలోని పద్మావతి టైల్స్ ఫ్యాక్టరీ, శ్రీనివాస సిరామిక్స్ ఫ్యాక్టరీల్లో.. తయారవుతున్న పెంకులను పరిశీలించారు. వాటి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో 32 టైల్స్ ఫ్యాక్టరీ ఉండేవని.. కాలక్రమేణా వాటి ఉపయోగం లేక మూతపడ్డాయని కార్మికులు మంత్రికి తెలిపారు. ఎంతో పని కల్పించే ఫ్యాక్టరీలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని ఇప్పటికైనా... వీటిమీద మంత్రి చర్యలు తీసుకుని ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details