తూర్పు గోదావరి జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలన్నీ.. మడ అడవులతో విస్తరించి ఉండడంతో... విదేశాలకు చెందిన అనేక రకాల పక్షి జాతులు వలస వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తాళ్ళరేవు మండలం కోరంగిలోని అభయారణ్యానికి... వేసవి విడిదిగా.. పలు రకాల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. అలా ఈసారి కూడా వలస వచ్చిన పక్షుల గుంపులో నుంచి ఓ పక్షి దారి తప్పింది.
బాతు కాళ్లు, కొంగ ముక్కు కలగలిసిన ఈ పక్షి... తాళ్ళరేవు మండలం గ్రాంటు గ్రామంలోని రాయుడు రాంబాబు చేపల చెరువులో.. తెల్లవారుజామున పడి ఉంది. దీన్ని గమనించిన వారు.. ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. రాజమహేంద్రవరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.