కుటుంబ కలహాలతో కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో విషాదం చోటు చేసుకుంది. ఎదుర్లంక వారధిపై నుంచి ఓ తండ్రి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న మొమ్మిడి శ్రీనివాస్... కుమార్తె హరిణి, కుమారుడు హర్షతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చి గోదావరిలో దూకేశాడు.
నిన్న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్‌పై భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.