తేలికపాటి వర్షం.. కాస్త ఉపశమనం - west godavari
భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. వరుణుడు కాస్త కరుణించడం వల్ల చల్లటి గాలులు వీచాయి.
తేలికపాటి వర్షం.. కాస్త ఉపశమనం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కురిసిన కొద్దిపాటి వర్షంతో అనపర్తి వాసులు సేద తీరారు. కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో విసిగిపోయిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆకాశం మేఘావృతమై ఆహ్లాదంగా మారడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సేదతీరారు. అయితే... విద్యుత్‌కు అంతరాయం కలగడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డారు.